సాధారణంగా ఎన్నికలలో పోటీ చేసి, గెలిచిన నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చాలావరకు విస్మరించి ఓటర్లను మోసం చేస్తూ ఉంటారు. ఇది అన్ని రాజకీయ పార్టీల లో నూ చోటుచేసుకునే అంశమే. ఈ విషయాన్ని జనాలు సైతం అంత సీరియస్ గా అయితే తీసుకోరు. రాజకీయాలలో ఇవన్నీ షరా మామూలే అన్నట్లుగా వదిలేస్తారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్లకు పెద్ద షాకే ఇచ్చాడు. గత గ్రేటర్ ఎన్నికల తో పోలిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని,  ప్రజల్లో చైతన్యం పెరిగిందని, యువత విద్యావంతులు ఎక్కువగా ఉండే గ్రేటర్  పోలింగ్ గతంకంటే మరింతగా పెరుగుతుందని అంచనా వేశారు. ఇక సెలబ్రిటీలు సైతం  సోషల్ మీడియా ద్వారా ఓటింగ్ విషయంలో ప్రచారం చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సందేశాలు ఇచ్చారు. 





కానీ నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన ఓటింగ్ సరళిని చూస్తే , చప్పగానే  సాగింది. సాయంత్రం వరకు పెద్దగా ఓటర్లు క్యూలైన్లలో కనిపించలేదు. ఓటింగ్ ప్రక్రియ చప్పగా సాగింది. దీంతో గ్రేటర్ ఓటర్లపై ఎక్కడలేని ఆగ్రహం వ్యక్తం అయింది. సోషల్ మీడియాలో గ్రేటర్ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో పోస్టింగ్స్ కనిపించాయి. అసలు సామాజిక స్పృహ లేదని, బద్ధకస్తులు అని, వీరికి ప్రభుత్వ పథకాలు అనవసరం అని , ఎన్నో రకాలుగా విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. అయితే ఓటర్లు అసలు ఓటింగ్ ప్రక్రియ కు ఎందుకు అంతగా ఆసక్తి చూపించలేదు అనే దానిపై ఎన్నో రకాల విశ్లేషణలు వచ్చాయి. కొంత మంది ఓటర్లదే ఈ తప్పు అని , కాదు కాదు ఈ తప్పంతా పార్టీలదే అని విశ్లేషించారు. వాస్తవంగా చూసుకుంటే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి గట్టిగానే కష్టపడ్డాయి. చావోరేవో తేల్చుకోవాలి అన్నట్లుగానే వ్యవహరించాయి.





 ఈ ఎన్నికల్లో సత్తా చాటు కోవడం ద్వారా,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటవచ్చు అని అభిప్రాయపడడం తోనే గట్టిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, టిడిపి మరికొన్ని పార్టీలు ఈ ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. కానీ టిఆర్ఎస్, బిజెపి మాత్రం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టిగా ప్రభావం చూపించేందుకు ప్రయత్నించాయి. బిజెపి నాయకులు అందరూ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, హడావుడి చేశారు ఇక టిఆర్ఎస్ సైతం అంతే స్థాయిలో హడావుడి చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల మధ్య చోటు చేసుకున్న విమర్శలు మరి శ్రుతి మించినట్లు గా కనిపించాయి. ముఖ్యంగా మత, జాతి, విద్వేషం పెరిగేవిధంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలు చేస్తున్న విమర్శలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.





 ముఖ్యంగా బిజెపి సర్జికల్ కంటూ పాతబస్తీ లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తలదాచుకున్నారు అంటూ , వారే ఎంఐఎం పార్టీకి నకిలీ ఓటర్ కార్డు ద్వారా ఓట్లు వేస్తున్నారు అని ఎన్నో రకాలుగా ఎన్నో విమర్శలు చేశారు. ఇక బిజెపి పై టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు విమర్శలు చేశాయి.ఈ వ్యవహారాలతో అక్కడ అక్కడ ఘర్షణలు చోటు చేసుకోవడం, అల్లర్లు జరిగే అవకాశం పోలింగ్ తేదీన చోటు చేసుకుంటుంది అని, గ్రేటర్ ఓటర్ లలో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇలా ఎన్నో కారణాలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. దీనికితోడు కరోనా వైరస్ భయం తగ్గకపోవడం వంటివి కూడా ఓటింగ్ తగ్గడానికి కారణం గా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో పూర్తిగా ప్రజల్ని తప్పు పట్టేందుకు అవకాశం లేదు. ఇందులో ఓటర్ల కంటే రాజకీయ పార్టీలదే  ఎక్కువ తప్పు ఉన్నట్టుగా  కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: