మీనా బాలనటిగా నటించి ఆ తర్వాత ప్యామీలీ రోల్స్ చేసి అందరి మనుసులు గెలుచుకున్న నటి. కానీ మీనా భర్త ఏడాది కింద చనిపోయారు. హుందాగా, గౌరవనీయంగా ఉండటంలో మీనాది ప్రత్యేక శైలి. ప్రతిభతో ఆమె ఎన్నో విజయాలు సాధించారు. ఆమె తన భర్తను కోల్పోయి ఇక్కట్లలో పడితే ఆమెపై సోషల్ మీడియాలో విచిత్రమైన కథనాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని తంబ్ లైన్ పెడుతూ, వీవర్స్ కోసం, లైక్స్ కోసం ఇలా చేస్తుంటారు.


మీనా చాలా క్లియర్ గా చెప్పింది. నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఉంటే చెప్పడానికి వెనకాడనని చెప్పుకొచ్చింది. కానీ ఈ మధ్య ఒక తమిళ ఇంటర్వ్యూలో ఒక నటుడు కూడా ఇలానే కామెంట్లు చేశాడు. మీనా ఒక తమిళ హిరోను పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. ఆయన అందుకోసమే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడని ప్రచారం చేశారు. మీనా మాత్రం ఇప్పటికే స్పందించారు. ఇలాంటివి ఎక్కడ పుడుతున్నాయో తెలియదు కానీ వారి ఆదాయం కోసం ఇంతటి నీచానికి దిగజారుతారా అంటూ ఆమె ఆవేదనను వెల్లడించింది. అయినా ఇప్పటికైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారు కాస్త ఆలోచించాలి.


మీనా భర్త అనారోగ్యంతో చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. మీనాకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె భర్త చనిపోయాక ఒంటరిగానే ఉంటోంది. తన కూతురును బాగా చూసుకుంటూ కాలం గడుపుతోంది.  సడెన్ గా మీనా రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో రాగానే ఆమె చాలా బాధ పడింది. సెలబ్రెటీల జీవితాలతో కొందరు కావాలనే ఆడుకుంటున్నారు. వారిని గుర్తించి ఐపీ అడ్రస్ లా ద్వారా తెలుసుకుని కఠినంగా శిక్షించాలి.


మరోసారి నిరాధారమైన వార్తల్ని ప్రచారం చేయకుండా కఠిన చట్టాలను తీసుకురావాలి. సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోతే మరిన్ని ఫేక్ వార్తలు పుట్టుకొచ్చి సమాజంలో విద్వేషాలు కలిగిస్తాయనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: