
కానీ..మోడీని కేవలం డబ్బులు అప్పుల రూపంలో ఇప్పించే వాడిగా.. కేసుల నుంచి తనకు అభయం ప్ర సాదించేవాడిగా మాత్రమే జగన్ పరిగణనలోకి తీసుకున్నారన్న వాదన ఆయన పాలనా కాలంలో జోరుగా వినిపించింది. కానీ.. వాస్తవం ఏంటంటే.. మోడీకి ఉన్న ప్రధాన లక్షణం.. ఒక్కసారి అధికారం చిక్కిందా.. ఇక, దానిని ఉడుం పట్టు మాదిరిగా పట్టుకుని ఉండడమే. అటు గుజరాత్ రాష్ట్రంలో అయినా.. ఇటు కేంద్రంలో అయినా.. మోడీ అధికారాన్ని వదిలి పెట్టలేదు.
తాజా లెక్కల ప్రకారం.. 25 సంవత్సరాలుగా మోడీ అధికారంలోనే ఉన్నారు. పైగా అత్యున్నత స్థాయిలోనే ఉన్నారు. గుజరాత్‌లో 13-14 సంవత్సరాల పాటు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత.. ప్రధాని అయ్యారు. ప్రస్తుతం ఆయన 11 సంవత్సరాలు పీఎంగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఆయనకు కలిసి వచ్చింది ఆయన నడవడి.. ఆయన వ్యూహం.. రాజకీయ ఎత్తుగడలే. ఈ విషయాన్ని కనుక జగన్ పట్టుకుని ఉంటే.. ఒక్కసారి దక్కిన అధికారాన్ని ఆయన వదులుకునేలావ్యవహరించి ఉండేవారు కాదన్నది విశ్లేషకుల అంచనా.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. ఇప్పుడు మోడీ బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు దక్కిన అధికారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులు కోకుండా.. చేసుకునేలా మోడీ మంత్రాన్ని జపిస్తున్నారు. నిరంత రం ప్రజల మధ్య ఉంటున్నారు. వారితోనే గడుపుతున్నారు. ఏ చిన్న చాన్స్ చిక్కినా.. ప్రజల కష్టాలు వింటున్నారు. ఏదొ ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. తద్వారా.. చంద్రబాబు ఇప్పుడిప్పుడే మోడీ లెస్సన్ ఒంటబట్టించుకుంటున్నారు. మరి ఇది ఏమేరకు ఆయన నిలబెట్టుకుంటారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు