
గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ నుంచి సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఆయన ధ్యేయం, ధ్యాస ఒక్కటే. ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి. పేదవాళ్లకు ప్రభుత్వం అండగా నిలవాలి ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం మెరుగవ్వాలి. ఆయన పుట్టింది కర్నాటక రాష్ట్రం అయినా ఐఏఎస్ అధికారిగా ఉద్యోగరిత్యా స్థిరపడింది మాత్రం తెలుగు గడ్డ మీదే. తెలుగుతనం అన్న తెలుగు భాషా ప్రావిణ్యం అన్న ఆయనకు ఎంతో మక్కువ. 2004లో రాష్ట్రంలో అడుగు పెట్టినప్పటి నుంచి సమర్ధవంతమైన బాధ్యతలు చేపట్టి తమ విధేయతను చాటుకున్నారు. ముఖ్యంగా 2017లో చిత్తూరు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మన్నలను పొందగలిగారు. చిత్తూరు జిల్లా ప్రగతిని రాష్ట్రానికే ప్రతీకగా మిగిలిపోయేలా చేశారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ఆయన నేతృత్వంలో చిత్తూరు భారతదేశంలో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ప్రకటించబడిన మొదటి జిల్లా అయ్యింది. రూ. 541 కోట్లతో 2.77 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించగా, 3.80 లక్షల టాయిలెట్లు నిర్మించబడ్డాయి. కేవలం ఏడాదిలో 630 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 950 కి.మీ. సీసీ రోడ్లు నిర్మించారు. నాలుగు పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో 20,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి, భవిష్యత్తులో మరో 50,000 ఉద్యోగాల అవకాశం ఉంది. హార్టికల్చర్ విస్తరణ ద్వారా అదనంగా 40,000 హెక్టార్ల భూమిని తోటల సాగు కిందకు తీసుకొచ్చారు. కృష్ణా నది నీటిని చిత్తూరుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇటువంటి సంస్కరణలతో చిత్తూరును మోడల్ జిల్లా గా మార్చడంలో అప్పడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు మనస్సు గెలవడంతో పాటు భారతదేశంలోని టాప్ 10 ప్రేరణాత్మక IAS అధికారులలో ఒకరుగా నిలిచారు.
కర్తవ్యదీక్షలో నిబద్ధత, అకుంఠితధీక్షలో పట్టుదల ఆయన నిజాయితీనం పట్ల ఆకర్షితులైన చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను సీఎంవోలోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన ఆలోచనలకు జీవం పోస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చారు. సీఎం ప్రతి నెల మొదటి తారీఖు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసాను అందించి, ప్రజావేదికను ఏర్పాటు చేసి వినూత్న రీతిగా విజయవంతం చేయడంలో ఆ అధికారి కీలకపాత్ర పోషిస్తున్నారు. సీఎం సైతం ఆ అధికారి పనితనానికి మెచ్చి కీలకమైన పంచాయితీరాజ్, పట్టాభివృద్ధి, మానవవనరులు, సెర్ప్, గిరిజన, మహిళా సంక్షేమం వంటి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. విషయమేమిటంటే సీఎం కార్యదర్శుల్లో గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఏకైక అధికారి ఈయన కావడమే విశేషం. అందుకే గిరిజనాభివృద్ధికి సైతం ఆయన ఎంతో కొంత తోడ్పాటును అందిస్తున్నారు. అయితే ఈ అధికారిని ఆ హోదా నుంచి దించేందుకు శత్రువులు తమ కుట్రలకు పదును పెడుతున్నారు. అభయం సత్యసంశాద్ధిర్ జ్ఞానయోగవ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాద్యాయస్తవ ఆర్జనమ్ అంటే నిజాయితీగా లక్షణాలు ఉన్న వాళ్లకు లోకంలో ప్రతిబంధకాలు, శత్రువులు రావచ్చు కాని వీరు తన మార్గాన్ని విడిచిపోరని భగవద్గీతలో సారంశం.
సత్యాన్ని పాటించే వారిపై అసత్య మార్గులు అసూయతో ఉంటారు. ఇటువంటి నికార్సైన అధికారులపై ఏదో విధంగా అవినీతి మరకలంటించేందుకు ప్రత్యర్ధులు ప్రతిక్షణం తాపత్రయపడుతూనే ఉంటారు. ఇప్పుడు సదరు అధికారిని సైతం సామ, భేద, దండోపాయాలు ప్రయోగిస్తూ అనుక్షణం మనోవేదనకు గురి చేస్తున్నారని సమాచారం. వీటన్నింటిని తట్టుకొని సీఎం తనను నమ్మి అప్పగించిన బాధ్యతను నెరవేర్చే విషయంలో ఆయన నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారు. ఆ కఠోర శ్రమ నచ్చేనేమో కీలకమైన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం బాధ్యతలు ఆ అధికారికే అప్పగించారు. అందులో భాగంగానే రాష్ట్రానికి దేశం మెచ్చే ప్రాజెక్టులను తీసుకురావడంలో సఫలీకృతులవుతున్నారు. సీఎం ఆలోచలనలకు అనుగుణంగా రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి చంద్రబాబు మానసపుత్రికైనటువంటి డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక స్వాలంబన చేకూర్చేలా కార్యాచరణ చేపట్టారు. డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు ఆన్‌లైన్ విక్రయ వేదికను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో ఈ ప్రత్యేక వేదిక ద్వారా వినియోగదారులు నేరుగా డ్వాక్రా మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దీని అంకురార్పరణకు మూలం ఆ అధికారే. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెర్స్, టైం బ్యాంక్ మ్యానేజిమెంట్, మ్యాప్ మై ఇండియా, ఐఐటీ చెన్నైతో అనుసంధానం, రైతులు పండించిన పంటలకు లాభం వచ్చేలా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం, ఏఐ టెక్నాలీజీని ఓరాకిల్ ద్వారా విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇప్పించడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్వతాహాగా ఎవరికి తలవంచరు. ఎందుకంటే నిజాయితీని ఆభరణంగా ధరించిన భోళాశంకరుడు. ఎందుకంటే సీఎంవోలో ఆయనను కలవడానికి వచ్చిన సామాన్యులకు దగ్గరుండి పని పూర్తి చేసి పంపిస్తారని సమాచారం. అంతేకాకుండా ఆయన ఆహార్యం కఠినత్వం, పలకరింపు సుతిమెత్తనం ఎంత లోతో ఆయన మనస్సు దగ్గరైన వాళ్లకే అర్ధమౌతుందని ఆ అధికారిని కలిసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు