
టిడిపి పసుపు పండగ మహానాడు ఈనెల 27 - 28 - 29 తేదీలలో అత్యంత వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడు అనేక సంచాలనాలకు వేదిక కానుంది అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ మమానాడు లోనే పార్టీకి దశాదిశా చెప్పడంతో పాటు మరిన్ని వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా వైసిపికి షాక్ ఇచ్చే అంశాలే ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పటివరకు వైసీపీ నుంచి వచ్చిన వారిని టిడిపిలో చేర్చుకున్న మహానాడు వేదికగా దీనికి మరింత ఊపు తీసుకు వస్తారని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనే ఈసారి మహానాడు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోని వైసీపీకి భారీ షాకులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తమకు ఎదురులేని జిల్లాలో సైకిల్ పరుగులు పెడుతుందన్న సంకేతాలు ఇవ్వనున్నారు. వైసీపీ నుంచి వచ్చే చాలామందికి కేలక నాయకులకు మహానాడు వేదికగానే కండువా కప్పనున్నట్టు తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు ఇప్పటికే పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారట. జగన్ మేనమామ ప్రాథమిక వహించిన కమలాపురం నుంచి చాలామంది నాయకులు టిడిపిలోకి వస్తున్నారట. ఈ బాధ్యతలను టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా జగన్ కు సొంత జిల్లా లో వరుస పెట్టి బిగ్ షాకులు తగులుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు