ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబరులో వెలుగుచూసిన కరోనా వైరస్... మొత్తం ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులో పెడుతోంది. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీంతో ప్ర‌జ‌లు మ‌రింత ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు న‌ష్ట‌పోతున్న ప‌లు కంపెనీలు అప్పుల భారం త‌ట్టుకోలేక.. త‌మ ఉద్యోగుల‌ను తొలిగిస్తున్నారు.

 

దీంతో ఉద్యోగులు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఏపీలోని నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ వైధ్య విధాన పరిషత్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 723 ఖాళీలను ప్రకటించింది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసన్, అనస్థీషియా లాంటి విభాగాల్లో ఈ ఖాళీలను ప్రకటించింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పషలిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 19న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 18 చివరి తేదీ. 

 

పోస్టుల విష‌యానికి వ‌స్తే.. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం ఖాళీలు 723 ఉండ‌గా.. అందులో గైనకాలజీ- 333, పీడియాట్రిక్స్- 38, అనస్థీషియా- 105, జనరల్ మెడిసిన్- 37, జనరల్ సర్జరీ- 29, ఆర్థోపెడిక్స్- 31, ప్యాథాలజీ- 24, ఆప్తమాలజీ- 27, రేడియాలజీ- 27, సైకియాట్రి- 7, డెర్మటాలజీ- 11, ఈఎన్‌టీ- 23 మ‌రియు డెంటల్ అసిస్టెంట్ సర్జన్- 31 పోస్టులు ఉన్నాయి. పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ, బీడీఎస్ ఉండాలి. 2020 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. వ‌య‌స్సు విష‌యానికి వ‌స్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. వేతనం రూ.53,500 గా నిర్ణ‌యించారు. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ అధికారిక వెబ్‌సైట్‌ http://cfw.ap.nic.in/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: