సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రధానమైన పోస్టులు ఉండే సీజీఎల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. నాలుగు అంచెల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉండడంతో పాటు పోటీ తీవ్రంగా ఉంటుంది. సిలబస్ను అవగాహన చేసుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఉద్యోగం సాధించడం చాలా ఈజీ.పోస్టుల వివరాలకొస్తే..అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌, అసిస్టెంట్‌/ సూపరింటెండెంట్‌, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్‌), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్‌), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్‌, డివిజనల్ అకౌంట్స్‌, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌, ఆడిటర్‌, అకౌంటెంట్‌, అకౌంటెంట్‌/ జూనియర్ అకౌంటెంట్‌, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌/ యూడీసీ, టాక్స్ అసిస్టెంట్‌, అప్పర్ డివిజన్ క్లర్క్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోస్టులు వున్నాయి.


ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే..టయర్1లో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో మాదిరిగానే ఉంటుంది. 100 ప్రశ్నలను 4 విభాగాలుగా విభజించి, ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ 0.5 ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. టయర్1లో క్వాలిఫై అయిన అభ్యర్థులను టయర్2కి ఎంపిక చేస్తారు.టైర్‌-2 పేపర్‌-1 పరీక్షలో కొత్తగా కొన్ని మార్పులు వచ్చాయి. 150 ప్రశ్నలకు 450 మార్కులు కేటాయించారు.2 గంటల 15 నిమిషాల నిడివిలో టైర్‌-2లోని పేపర్‌-1ని పూర్తిచేయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. సీజీఎల్‌ నోటిఫికేషన్‌లోని ఏ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులైనా టైర్‌-2లోని పేపర్‌-1 పరీక్ష రాయాల్సిందే. స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు పోటీ పడేవారు టైర్‌-2లో పేపర్‌-1తోపాటు పేపర్‌-2 కూడా రాయాలి. ఏఏఓ పోస్టుకు దరఖాస్తుచేసిన అభ్యర్థులు టైర్‌-2లో పేపర్‌-1తోపాటు పేపర్‌-3 కూడా రాయాలి. టైర్‌-2 పేపర్‌-1లో రాత పరీక్షతోపాటు డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ కూడా ఉంటుంది. 15 నిమిషాలు సెషన్‌కు కేటాయించారు. ఇది క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే. అయితే ఇందులోని మార్కులను మాత్రం ఫైనల్‌ మెరిట్‌ మార్కుల్లో పరిగణనలోకి తీసుకోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: