వంటింట్లో ఉండే మెంతులు ఏదో ఒక రూపంలో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతులను కూరల్లో వాడుతారు, కూరగాయల్లో పొడిని తప్పకుండా కలుపుతారు. మెంతి ఆకు తో పప్పు చేస్తారు.అంతేకాకుండా మెంతుల్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి జరిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

  డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లు మెంతులను వాడటం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి మెంతుల పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల డయాబెటిస్ దూరమవుతుంది.

 పైత్యము ఎక్కువగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసం తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని తాగడం వల్ల ఏ కాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.చర్మం మృదువుగా మారుతుంది.

 మెంతి ఆకు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు.ఎందుకంటే మెంతి ఆకులు కేలరీలు తక్కువగా ఉంటాయి.అంతేకాకుండా రక్తహీనత కూడా తగ్గుతుంది. ఇంకా కడుపుబ్బరం,కడుపులో మంట పంటి సమస్యలు తగ్గుతాయి.

 వెంట్రుకలు మృదువుగా ఉండాలంటే మెంతి ఆకు పేస్ట్గా తయారు చేసుకునే తలకు బాగా పట్టించాలి. అర్ధ గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మృదువుగా ఉంటాయి.

 నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు కూడా మెంతి ఆకు రసాన్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది.

 మెంతి ఆకును మెత్తగా నూరి, అందులోకి ఒక నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తీసుకోవడం వల్ల  అధిక బరువు ఉన్న వాళ్లకి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు,చాలా మంచిది.

 పొడిబారిన చర్మానికి మెంతి ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాయడం వల్ల చర్మం మృదువుగా ఉండటమే కాకుండా, మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.

 కామెర్లతో బాధపడుతున్న వాళ్లకి,  కాలేయ వ్యాధితో ఉన్న వాళ్లకి,మెంతి ఆకుల రసాన్ని వేడి చేసి అందులో తేనె కలిపి తాగడం వల్ల ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.

 నీళ్ళ విరేచనాలు అవుతుంటే వేయించిన మెంతిపొడిని మజ్జిగ తో కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.

రెండు లేదా మూడు చెంచాలు మెంతులను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం పోయి, మూత్రం సాఫీగా అవుతుంది.మెంతి ఆకు ఆరోగ్యానికి మంచిది.. ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి...!

రెండు లేదా మూడు చెంచాలు మెంతులను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం పోయి, మూత్రం సాఫీగా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: