నువ్వులు తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. నువ్వులను వంటకాల్లో వాడుతారు. అలాగే లడ్డూలు చేసుకొని తింటారు . నువ్వుల నూనె ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు బలహీన పడకుండా కాపాడుతుంది. అలాగే కండరాలు దృఢంగా ఉండేటట్లు చేస్తుంది. అంతేకాకుండా నువ్వుల్లో మినరల్స్, జింక్, క్యాల్షియం, ఐరన్ మరియు విటమిన్ ఇ ఈ ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ ఒక్క స్పూన్ నువ్వులు తినడం వల్ల శరీరానికి  కావాల్సిన పోషకాలన్నీ  అందుతాయి. ఇంకా చాలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                                           

 ప్రతి రోజు ఒక స్పూను గుడ్డు తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తొలగిపోతుంది. రక్తనాళాల్లో  పేరుకుపోయిన కొవ్వును కరిగించి గుండె జబ్బుల బారిన పడకుండా చూస్తుంది. అంతేకాకుండా అధిక బరువు కూడా తగ్గుతారు.

 రోజు నువ్వులు తినడం వల్ల నువ్వు లో ఉండే లిగ్నిన్స్ కారణంగా విటమిన్ 'ఇ 'ని అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నిర్మూలిస్తుంది.

 పాలలో కన్నా నువ్వుల్లో ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది ఆస్టియో ఫ్లోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

 ఒక స్పూన్ నువ్వులు తినడం వల్ల రక్తం  శుద్ధి అవుతుంది. అంతేకాకుండా నువ్వు లో ఉండే కాపర్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. బలహీనంగా ఉన్న వాళ్ళు రోజు నువ్వు తినడం వల్ల బలంగా ఉంటారు.

 నువ్వుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. అంతేకాకుండా రక్తంలోని హిమోగ్లోబిన్   శాతాన్ని పెంచుతుంది.  అందుకే రోజు ఒక స్పూన్ వారం రోజులు నువ్వులు తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: