రాముని కాలం నుంచి కూడా ఔషధ గుణాలు కలిగిన అనేక రకాల ఔషధ మొక్కల్లో ఈ అతి మధురం మొక్క కూడా ఒకటి. ఆయుర్వేదంలో ఈ మొక్క వేరును అనేక జబ్బులను నయం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ అతి మధురం వేరుతో చాలా రకాల అనారోగ్య సమస్యలను మనం ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఇక ఈ అతి మధురం శాస్త్రీయ నామం గ్లైసరీసా గాబ్రా. అలాగే హిందీలో ములెట్టి అని, ఇంగ్లీష్ లో లెకోరీస్ అని కూడా దీన్ని పిలుస్తారు. అతి మధురం మొక్క మొత్తం 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కకు ఉండే అతి తీపి వల్ల దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది.ఇది విరోచనాలు సాఫీగా అయ్యేలా చేయడంలో, దగ్గును తగ్గించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగించగడంలో  మనకు చాలా బాగా సహాయపడుతుంది.


అతి మధురం వేరు  ఔషధ గుణాలు కడుపులో పండ్లను తగ్గించడంలో  మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ అతి మధురం చూర్ణాన్ని ఒకటి లేదా రెండు గ్రాములు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు, హైపర్ ఎసిడిటీ వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అలాగే ఈ వేరు చూర్ణాన్ని అర టీ స్పూన్ తీసుకొని నీటిలో వేసి కషాయంలా చేసుకుని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల అల్సర్లు తగ్గుతాయి. ఇంకా అలాగే గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు, గొంతు శ్రావ్యంగా లేనప్పుడు, కఫం తొలగిపోకుండా దగ్గు వస్తూ ఉన్నప్పుడు అతి మధురం చూర్ణాన్ని వాడితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు అతి మధురం చూర్ణానికి తేనెను కలిపి చప్పరించి మింగడం వల్ల దగ్గు ఇంకా గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా అతి మధురం మనకు బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: