
ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తరచూ మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో నిద్ర లేవగానే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నిద్ర లేదా బద్ధకంగా లేదా అలసటగా అనిపిస్తే ఆల్కహాల్కు దూరంగా ఉండటమే మంచిదట.
సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ పై ఆల్కహాల్ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఎక్కువగా వేధిస్తే.. ఇక రోగనిరోధక శక్తి తగ్గింది అని అర్థం చేసుకొని ఆల్కహాల్కు దూరంగా ఉండటం మంచిదట.
ఇక తరచూ అనారోగ్యం పాలు అవుతున్న కూడా మద్యానికి దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు నిపుణులు.
సాధారణంగా చాలామంది మద్యం తాగిన తర్వాత నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇక మీలో కూడా అలాంటి సమస్య ఉంటే ఆల్కహాల్ ను దూరం పెట్టడం మంచిదట.
ఆల్కహాల్ కాలేయం సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీలో దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే.. మద్యానికి దూరంగా ఉండాలట. ఇక కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే ఇది ఆల్కహాల్ దుష్ప్రభావంగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు.
ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతిస్తుంది. ఇక ఆ జీర్ణం లేదా ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటే మద్యానికి దూరంగా ఉండటమే మంచిది.
ఇక తరచూ మద్యం తాగే వారిలో చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. దురద దత్తుర్లు వస్తూ ఉంటే దానికి మధ్యపానం అలవాటే కారణమని అర్థం చేసుకోవాలట. వెంటనే మద్యం సేవించడం మానేస్తే సానుకూల ప్రభావాలను గమనించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.