సాధారణంగా చాలామంది పొద్దున లేవగానే కాఫీలు టీలు పడందే పొద్దుగడవదు.ఈ కాఫీ,టీలతోనే ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఉన్నారంటే,ఇక టిఫిన్ మాట చెప్పనక్కర్లేదు.టిఫిన్ సమయంలో ఎక్కువగా చాలామంది ఇడ్లీ,దోశ తినడానికి ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా ఇడ్లీ అంటే చాలా ఈజీగా అరుగుదల అవుతుందని,తక్కువ క్యాలరీలు ఉంటాయని అపోహ పడుతూ ఉంటారు.కానీ దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు ఆహార నిపుణులు.ఇవి దీర్ఘకాలం పాటు తింటే అంతే సంగతులట.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అనారోగ్య సమస్యలు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..

నిజానికి బియ్యం లో ఉన్న క్యాలరీల కన్నా,మినప్పప్పు లోనే అధికంగా క్యాలరీలో ఉంటాయి.ఎవరైతే డైట్ చేయాలని ఇడ్లీ దోశలు తింటూ ఉంటారో,వారికి ఎటువంటి ప్రయోజనము కలగదు.ఎందుకంటే  ఇడ్లీ,దోశలను బియ్యము మరియు మినప్పప్పులతో తయారుచేస్తారు కనుక.ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ వారి బరువును మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు.

రోజు దోశ మరియు ఇడ్లీలను పులియబెట్టిన పిండితోనే తయారు చేస్తారు.కనుక ఇందులో ఉన్న బ్యాక్టీరియా క్రమంగా కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ని ఎఫెక్ట్ చేసి, గ్యాస్ ఫార్మ్ అయ్యేలా ప్రేరేపిస్తుంది.దీనితో గ్యాస్,అజీర్తి సమస్యలు కలుగుతాయి.

ఇడ్లీ,దోశ బ్యాటర్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ రక్తంలోని గ్లూకోస్ లెవ్వాల్సిన పెంచి,మధుమేహానికి దారి తీస్తాయి. ఇక ఆల్రెడీ మధుమేహంతో బాధపడేవారు వీటికి ఎంత దూరంగా ఉండే అంత మంచిది.

వీటన్నిటి బదులుగా పూర్వకాలంలో మన పెద్దలు అందించిన ఆహారాలు తినడం చాలా బెటర్ అని చెబుతున్నారు ఆహార నిపుణులు.వాటిలో ముఖ్యంగా రాగి జావా, రాగి ముద్ద,సద్దన్నంలో  పెరుగు,ఉల్లిపాయ, మిరపకాయ నంచుకుని తినడం,జొన్న కటక వంటివి తయారు చేసుకుని తినడం వల్ల విటమిన్ b6వంటివి అధికంగా అందడమే కాకుండా,జీర్ణశక్తి కూడా మెరుగు పడుతుంది.ఈ తృణ ధాన్యాల్లో ఉన్న ఐరన్,కాల్షియం, మెగ్నీషియం వంటివి ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి.

కావున మీరు కూడా ఇక నుంచి ఇడ్లీ,దోశలు స్కిప్ చేసి పూర్వకాలం పద్ధతుల్లోనే ఆహారం తీసుకోవడం మొదలు పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: