
ఇంట్లో నుంచి కాళ్లు బయటపెట్టాలి అంటేనే వృద్ధులు భయపడిపోతున్నారు . గవర్నమెంట్ కూడా ప్రజలకు కొన్ని సూచనలను సలహాలను ఇస్తుంది. చిన్నపిల్లలు .. గర్భిణీ స్త్రీలు..ముఖ్యంగా ముసలి వాళ్ళు ఇంట్లో నుండి బయటకు రావద్దు అని అవసరమైతే తప్పిస్తే అనవసరంగా బయట తిరగదు అంటూ చెప్పుకొస్తుంది . కొత్త వైరస్ వేరియంట్ కారణంగా కోవిడ్ బెంగళూరులో 84 ఏళ్ల వయసు ఉన్న వృద్ధుడు మరణించడం ఇప్పుడు ప్రజలకి కొత్త భయాన్ని కలగజేస్తుంది . కొమిక్రాన్ బిఏ 2.86 నుంచి ఇది మార్పు చెందింది అంటూ తెలుస్తుంది .
ఈ మే నెలలో కేరళలో అత్యధికంగా 273 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే కరోనా ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ముంబై తో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది . అంతేకాదు బెంగళూరు ప్రభుత్వం అలర్ట్ అయింది. స్టేట్ లో మొదటి కరోనా మరణం నమోదవడంతో ప్రభుత్వం కొన్ని కొన్ని నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది . మరీ ముఖ్యంగా ఇలాగే కేసులు ఎక్కువ అయిపోతూ ఉంటే బెంగళూరు స్టేట్ లాక్ డౌన్ విధించే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాలి అంటేనే జనాలు భయపడిపోతున్నారు . బెంగళూరులో పనిచేసే ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వచ్చే ఆలోచనలో ఉన్నారు . కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి..!