ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ లభిస్తాయి. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి అనారోగ్యాలు చుట్టుముడతాయి.