దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ చిన్నారుల మీద కూడా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ బాధితుల్లో 15 శాతం వరకు పిల్లలే ఉండటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.