
1).రక్తహీనత..
మనం తినే ఆహరంలో ఐరన్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ అంజీర పళ్ళు రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరిగిందని అలాగే రక్త కణాల సంఖ్య పెరిగిందని పరిశోదనలు చేసి మరీ నిరూపించారు. ఈ పళ్ళలో గల ప్రోటీన్లు మరియు విటమిన్ బి రక్తకణాల పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి.
2).ఒత్తిడిని తగ్గించుకోవడానికి..
మానసికంగా చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు.అలాంటి వారికి బీపీ,ఊబకాయం, షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.బీపీ స్థాయిలను సమతుల్యం చేసే ఉప్పు పొటాషియం. రక్తపోటును అదుపు చెయ్యడానికి పోటాషియం చాల అవసరం. రోజూ అంజీరాలు తినడం వల్ల పొటాషియం పుష్కళంగా అంది, రక్తపోటును తగ్గించడంలో భాద్యత వహిస్తుంది.
3).జుట్టు రాలుట నివారించడానికి..
అంజీర పళ్లలో గల పోషకాలు జుట్టును కాపాడటం లోను,కండిషన్ చెయ్యడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. పళ్ళు మాత్రమే కాక అంజీర విత్తనాల నూనెను వాడడం వల్ల జుట్టుకి, విటమిన్ ఈ (E) మరియు విటమిన్ కె (K) అందించి జుట్టు యొక్క సహజ మెరుపుకి మరియు జుట్టురాలుటను నివారించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
4).ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంలో..
అంజీర పళ్ళ రసం దగ్గు మరియు జలుబుకు చాలా బాగా పనిచేస్తుంది.అంజీర పళ్ళు తీసుకోవడం వల్ల గొంతులో ఉండే అధిక శ్లేషాన్ని (mucus) తొలగించడానికి బాగా సహాయపడుతుంది.అంజీరను దీర్ఘకాలిక దగ్గు మరియు అలంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా వాడుతారు.