సాధారణంగా పూర్వం రోజుల్లో 40 నుంచి 50 సంవత్సరాలు పైబడితేనే తెల్ల జుట్టు కనపడేది.కానీ ఈ మధ్యకాలంలో జీవన శైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు సర్వసాధారణమైపోయింది.వీటిని కలర్ తో మేనేజ్ సరే మరి కొద్ది రోజులకె తెల్లగా మారి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి.ముఖ్యంగా 10 సంవత్సరాలలోపు పిల్లలకు కలర్లు వేయడం వల్ల,ఎన్నో రకాల క్యాన్సర్లకు గురవుతున్నారని పరిశోధకులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.ఇలాంటి వారి కోసం ప్రకృతిలో దొరికే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల నేచురల్ గా మన జుట్టును మార్చుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్న సూచిస్తూ ఉన్నారు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

జుట్టు తెల్లబడటానికి కారణము వంశపారంపర్యము విటమిన్ సి,డి,b12,ఐరన్,కాలుష్యం పెద్దల్లో అయితే మద్యపానం,ధూమపానం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.కావున వీటి డెఫిసియన్సీ కలిగిన ఆహారాలను రోజూ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా..

ఉసిరి..

ఉసిరి సమ్మర్ లో అధికంగా దొరికినప్పటికీ,దీనితో తయారు చేసే డ్రైఫ్రూట్స్ మరియు మాగకాయలను నిలువ చేసుకొని మరీ రోజు తీసుకోవడం చాలా మంచిది ఇందులో ఉన్న విటమిన్ ఏ మరియు విటమిన్ సి, జింక్,మెగ్నీషియం,సెలేనియం, తదితర పోషకాలు జుట్టు నల్లగా మారడానికి చాలా బాగా దోహదపడతాయి.అంతే కాక ఉసిరి అయిల్ పిల్లలకు రోజు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు తొందరగా పడకుండా కాపాడుతుంది.

గోధుమ గడ్డి జ్యూస్..

క్రమం తప్పకుండా రోజు గోధుమ గడ్డితో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల,జుట్టుకు విటమిన్ సి,జింక్ మొదలగునవి అధికంగా లభించి,తొందరగా గ్రే హెయర్ రాకుండా కాపాడుతుంది.చిన్నపిల్లలు దీని తాగడానికి ఇంతగా ఇష్టపడరు.కావున వీరికి గోధుమ గడ్డి లేతగా ఉన్నప్పుడే స్నాక్స్ పై గార్నిషింగ్ ఎలిమెంట్ గా వాడి తినిపించడం చాలా మంచిది.

నిగెల్లా సీడ్స్..

జుట్టు రంగు మారకుండా ఉండేందుకు రోజువారీ డైట్‌లో నిగెల్లా విత్తనాలను చేర్చుకోవాలి.ఇందులో ఉండే పోషకాలు వెంట్రుకలను తొందరగా గ్రే కాకుండా కాపాడుతాయి.వీటితో పాటు నువ్వులు,బ్లాక్ బీన్స్, జీలకర్ర,చియా విత్తనాలు,నల్ల బెల్లం వంటి పదార్థాలను  తీసుకోవడం వల్ల కూడా జుట్టు గ్రే కాకుండా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: