ఈ చలికాలంలో ఎక్కువగా లభించే ఫ్రూట్స్ లో ఆరెంజ్ కూడా ఒకటి.సాధారణముగా సీజనల్ ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరిగి, ఆ సీజన్లో వచ్చే సాధన సర్వసాధారణమైన రోగాలను దూరం చేస్తాయి.మరీ ముఖ్యంగా ఆరెంజ్ అధికంగా తీసుకోవడం వల్ల విటమిన్ సి పుష్కలంగా అంది,రోగ నిరోధక శక్తిని మరింత పెంచుతుంది.అంతేకాక ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దగ్గు, జలుబు జ్వరం వంటి రోగాలను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.వీటిని తీసుకునేటప్పుడు కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తీసుకోకూడదని,వాటి వల్ల ప్రయోజనాల కన్నా దుష్ప్రభావాలు ఎక్కువ కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఆరంజ్ తినేటప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో మనము తెలుసుకుందాం పదండి..

ఆరెంజ్ మరియు కాఫీ..

కాఫీ తాగిన వెంటనే ఆరెంజ్ తినడం కానీ,ఆరంజ్ తిన్న వెంటనే కాఫీ తాగడం కానీ అసలు చేయకూడదు.ఇలా చేయడం వల్ల ఆరెంజ్ అసిడిక్ విలువలను పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది.కావున పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

టమాటా మరియు నారింజ..

ఆరెంజ్ లో మాదిరిగానే టొమాటోలో కూడా విటమిన్ సి మరియు ఆక్జాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.కానీ ఈ రెండు యాసిడ్ విలువలు కలిగినవి.కావున ఈ పండ్లను కలిపి తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ పెరిగి, గ్యాస్,గుండెదడ వంటి సమస్యలు పెరుగుతాయి.

 పాలు మరియు నారింజ..

ఆరెంజ్ తిన్న వెంటనే పాలను తీసుకోవడం వల్ల, పాలలోని ప్రోటీన్ విరిగి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాలతో పొందాల్సిన న్యూట్రియన్స్ శరీరానికి అందకపోగా,గ్యాస్ ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.

ఆరెంజ్ మరియు మాంసం..

మాంసాన్ని అధికంగా తీసుకోవడంతోనే ఆసిడిక్ విలువలు పెరుగుతాయి.అలాంటిది ఆరెంజ్ తో పాటు తీసుకుంటే మరింత ఆసిడ్ రిఫ్లెక్షన్ పెరిగి గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి.దీనితో తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు.

ఆరెంజ్ మరియు పెరుగు..

పెరుగుతో కూడిన ఆహారాలు తిన్న వెంటనే ఆరెంజ్ అస్సలు తినకూడదు.ఈ పదార్తలకు చలువ చేసే గుణం ఉంటుంది.దానితో జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది.కనుక ఆరెంజ్ తో కలిపి ఈ ఆహారాలను అస్సలు తీసుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: