స్వీట్‌ పోటాటో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పైగా ఇది కేవలం ఆరోగ్యపరంగానే కాదు, అందానికి కూడా చాలా రకాలుగా లాభాలనిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చిలగడదుంప వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. దీంతో మీ ముఖం, చర్మం అందంగా మెరిసేలా కనిపిస్తుంది.చిలగడదుంపలో ఉండే కెరటనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు చిలగడదుంపను తినవచ్చు. దీంతో ఇందులో ఉండే పోషకాలు వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.చిలగడ దుంపలో ఐరన్, ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో అనీమియా సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడేవారు తమ డైట్లో చిలగడ దుంప ఉండేలా చూసుకోండి.ముఖ్యంగా ఎముకలు బలహానంగా ఉండేవారు చిలగడ దుంపను తమ ఆహారంలో చేర్చుకోవాలి.చాలా వరకు కూడా మనం చిలగడ దుంపను నీళ్లలోనే ఉడికించుకుని తింటాం. ఇందులో ఎలాంటి ఆయిల్ వాడం.


అందుకే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక మొత్తంలో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించేవారు చిలగడదుంపను వాడితే ఫలితం ఉంటుంది.రక్తపోటు సమస్యతో బాధపడేవారు చిలగడ దుంపను తమ తమ రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.ఎందుకంటే ఇందులో ఉండే పొటాషయం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుది.చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. కేరల్ లాగే చిలగడ దుంప కూడా కంటిచూపు మెరుగ్గా ఉండటానికి ఇది ఎంతగానో చేస్తుంది. ఇలా మీరు చుక్కనూనె లేకుండా స్వీట్‌ పోటాటో కనుక తింటే మీ గుండె పదిలంగా ఉండి నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నిత్యం చాలా అందంగా యవ్వనంగా కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: