బొప్పాయి ఆరోగ్యానికి ఇంకా అందానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఇది చర్మంపై కాలిన గాయాలు ఇతర చర్మ వ్యాధులకు చక్కటి సహజ నివారణిగా పనిచేస్తుంది. ఈ బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్. పొడిబారిన చర్మానికి తిరిగి సహజ తేమను తిరిగి తేవడంలో సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును మీ చర్మంపై క్రమం తప్పకుండా పూయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దాని సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జు మీ ముఖానికి సహజ బ్లీచ్‌లాగా పనిచేస్తుంది. బొప్పాయి మీ చర్మపు టాన్ వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని పాపైన్ ఎంజైమ్ మొటిమల మచ్చలు లేదా నల్లబడిన మోచేతులు, మోకాళ్ల వంటి ముదురు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.విటమిన్ ఎ, బి, సి చాలా ఎక్కువగా ఉండే బొప్పాయి మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లను, పపైన్, చైమోపాపైన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.


పపైన్ ఎంజైమ్‌లో ప్రొటీన్ కరిగిపోయే గుణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. డెడ్ స్కిన్ సెల్స్ ను బొప్పాయి క్లియర్ చేస్తుంది. బొప్పాయిలో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖం ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి.బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా, యవ్వనంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.బొప్పాయి పండులో మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఉంది. అందుకే బొప్పాయి పండును ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, బాడీ లోషన్ వంటి చర్మ సంబంధిత ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. బొప్పాయి మన శరీరంలోని అన్ని అవయవాలకు జీవితంలోని అన్ని దశలలో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: