
టమాటాలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చాలామందికి తెలిసే ఉంటుంది. టమాటాలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో లైకోఫిన్, బీటా కెరోటిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. టమాటాలను ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. వీటిని ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెజబ్బులు టైప్-2 డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం డామేజ్ కాకుండా కాపాడుతుంది.
టమాటాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసును కుదుటపడేలా చేస్తాయి. దీంతో మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు టమాటాలను ఎక్కువగా తినడం మంచిది. టమాటాల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చెవుల పనితీరును మెరుగు పరుస్తాయి. వయసూరిత్యా వచ్చే వినికిడి సమస్యలు రాకుండా కాపాడతాయి. టమాటోల్లోని పోషకాలు శరీరంలో రక్త ప్రసన్న మెరుగు పరుస్తాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. రక్తహీనత సమస్య కూడా ఏర్పడకుండా చూసుకోవచ్చు. టమాటోలు ఆంటీ ఇంఫ్లమేటరి గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లలో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.
దీంతో అర్థ రెడ్డిస్ రాకుండా కాపాడుకోవచ్చు. టమాటాలు ఎక్కువగా తినడం వల్ల సమస్య తగ్గించుకోవచ్చు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. టమాటాల్లో విటమిన్ కె, సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కులాజైన్ ఉత్పత్తిని పెంచి గాయాలు తొందరగా మానడంలో సహాయపడతాయి. టమాటోలో ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. టమాటోల్లో లైకోఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హార్మోన్ బాలన్స్ను కాపాడుతుంది. తద్వారా మహిళల్లో పీరియడ్ సమస్యలు రాకుండా చేస్తోంది. టమాటా తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.