
దానిమ్మ అంటేనే ఆరోగ్యానికి ప్రతీక. ఇది చూడటానికి ఎరుపెరుపుగా, నిగనిగలాడుతూ ఉంటే, అందులోని గింజలు అంతకన్నా శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగినవిగా పేరు పొందాయి. ప్రాచీన ఆయుర్వేదంలో దానిమ్మను "దివ్య ఫలం"గా చెప్పిన కారణమే అందులోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుప్పెడు దానిమ్మ గింజలు తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. వాటిని విభిన్న కోణాల్లో తెలుసుకుందాం. దానిమ్మ గింజల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ C వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనత ఉన్నవారికి ఒక ప్రాకృతిక ఔషధంలా పని చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువు సరఫరా సజావుగా సాగుతుంది.
ఈ గింజల్లో ఉండే పునికాలాగిన్స్అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కోలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె నాళాల్లో బ్లాకేజీలు రావకుండా అడ్డుకుంటుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి రక్షణ. ఉదయం తిన్నప్పుడు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ డేలో ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. బలహీనత, అలసట, నీరసం వంటి లక్షణాలు తగ్గుతాయి. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు పోషణ కలిగించి మెమొరీ పెరగడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దృష్టి శక్తి పెరిగే అవకాశం ఉంటుంది.
చర్మానికి మేలైన పోషకాలు ఇందులో ఉండడం వల్ల చర్మ కాంతి, మెరుపు పెరుగుతుంది. యాంటీఏజింగ్ గుణాలతో వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే దానిమ్మ గింజలు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఉదయం తినడం వల్ల గ్యాస్, వంటి సమస్యలు తగ్గుతాయి. దానిమ్మలోని విటమిన్ C, యాంటీబాక్టీరియల్ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ జలుబు, దగ్గు, ఫీవర్ వచ్చే వాళ్లకు ఇది ఉపశమనం కలిగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ కారక కణాల అభివృద్ధిని అడ్డుకుంటుంది. ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లలో ఇది సహాయంగా ఉండొచ్చు (పరిశోధనల ప్రకారం).