తీసింది నాలుగు సినిమాలే అయినా లేడీ డైరక్టర్ గా నందిని రెడ్డి బాగానే పాపులర్ అయ్యారు. అలా మొదలైంది నుండి ఓ బేబీ వరకు నాలుగు సినిమాల్లో జబర్దస్త్ ఒక్కటే నిరాశపరచింది కాని కళ్యాణ వైభోగమే కూడా హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ సమంత లీడ్ రోల్ గా చేసిన ఓ బేబీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమా కోసం హీరోల వేటలో పడ్డది. హిట్టు కొట్టిన డైరక్టర్ కు వెంటనే సినిమా ఛాన్స్ వస్తుంది.. అలానే నందిని రెడ్డికి ఛాన్సులు వస్తున్నా ఆమె అనుకున్న కథలకు హీరోలు దొరక్క ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి.

ఓ బేబీ వచ్చి సంవత్సరం దాటింది అయినా కూడా నందిని రెడ్డి తన తర్వాత సినిమా కన్ ఫాం చేసుకోలేదు. మొన్నామధ్య అక్కినేని హీరో నాగ చైతన్యతో సినిమా ఉంటుందని వార్తలు రాగా నందిని రెడ్డి సినిమా పక్కన పెట్టి విక్రం కుమార్ తో థ్యాంక్ యు సినిమా పట్టాలెక్కిస్తున్నాడు చైతు. ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఆమె చేయాల్సిందట. కాని ఈలోగా క్రిష్ ప్రాజెక్ట్ రావడంతో ఆమెకు హ్యాండ్ ఇచ్చి ఆ సినిమా ఓకే చేశాడు వైష్ణవ్ తేజ్.  

ఇలా తను కావాలనుకున్న హీరోల డేట్స్ దొరక్క సినిమాలు లేట్ చేస్తూ కెరియర్ లో వెనకపడుతుంది నందిని రెడ్డి. 9 ఏళ్ళ సినీ కెరియర్ లో ఆమె తీసింది కేవలం నాలుగు సినిమాలంటేనే అర్ధం చేసుకోవచ్చు. తీసుకున్న పాయింట్ ను కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలిగే నందిని రెడ్డికి అసలు హీరోలు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదో వారికే తెలియాలి. చైతు, వైష్ణవ్ తేజ్ లు అనుకుంటే వారు వేరే సినిమాలు చేస్తుండటంతో నందిని మరో యువ హీరోని వెతుకుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: