కరోనా బ్రేక్ నుండి నెమ్మదిగా అంతా మామూలు అవుతోంది. సినిమా షూట్ స్ కోసం ఎప్పుడో పర్మిషన్స్ ఇచ్చేసినా ఇచ్చిన వెంటనే ఎవరూ షూట్ కి వెళ్ళలేదు. కానీ ఈ వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోలో వస్తుందో తెలియని క్రమంలో ఒక్కొక్కరూ షూట్ కి వెళ్తున్నారు. తాజాగా తాను షూట్ ఈరోజు మొదలు పెడుతున్నానని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చుట్టూ పీపీఈ కిట్స్ వేసుకున్న తన స్టాఫ్ నుంచోగా మనోడు దానిని ఫోటో తీసు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకున్నాడు.

తాను నటించే సోలో బ్రతుకే సో బెటరూ సినిమా షూట్ లోనే మనోడు పాల్గొంటున్నాడు. రెండు హిట్స్ వచ్చిన ఊపుతో ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా థీమ్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నో పెళ్లి అంటూ సాగిన ఈ సాంగ్ సినిమా మీద అంచనాలు బాగానే ఏర్పడేలా చేసింది. ఇది కాక ఈయన ప్రస్థానం ఫేమ్ దేవా కట్టా డైరెక్షన్ లో ఒక సినిమా ఒప్పుకున్నాడు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మనోడు డాక్టర్ గా నటిస్తున్నాడని అంటున్నారు. అది కాక బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సుకుమార్ కథనం అందించనున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ కు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పి ఆ సినిమాని ప్రకటించారు కూడా. అది కాక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ఓ ఆసక్తికర చిత్రానికి ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ రచయిత ఆకుల శివ చెప్పిన కథ తేజ్ కి బాగా నచ్చిందని అంటున్నారు. ఆ సినిమా మనోడికి బాగా నచ్చడంతో వెంటనే ఓకె చెప్పాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: