సాధారణంగా ఒక సినిమాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, హీరోలు, విలన్లు ఎంత ముఖ్యమో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. అసలు హీరోయిన్ అంటూ లేని చిత్రాలు ప్రేక్షకులను సామాన్యంగా మెప్పించలేవు. నిజానికి ఒక డ్యూయెట్ అయిన హీరోయిన్ తో ఉండాల్సిందే. లేకపోతే ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి చూపరు. కానీ ఇక్కడ ఇదంతా రివర్స్. హీరోయిన్ లేకుండానే కేవలం హీరో మాత్రమే ఆ సినిమాలతో బాక్సాఫీస్ ను రఫ్ ఆడించారు. అయితే  కేవలం హీరోలతోనే వచ్చిన సినిమాలు ఏంటో..? మన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


1. చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా అంటే చాలు ప్రేక్షకులకు ఎక్కడ లేని హుషారు వస్తుంది. కానీ మెగా స్టార్ హీరోయిన్ లేకుండా కేవలం తను మాత్రమే నటించి, ఆ సినిమాలకు భారీ విజయాన్ని చేకూర్చాడు. మేజర్, బంధాలు అనుబంధాలు..వంటి సినిమాలలో సింగిల్ గానే మెప్పించాడు చిరంజీవి. అంతేకాకుండా ఇటీవల అతను నటించబోతున్న లూసిఫర్ రీమేక్ లో కూడా హీరోయిన్ లేకుండానే నటించబోతున్నట్లు సమాచారం.


2.  నాగార్జున:
మన్మధుడి గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాగార్జున.. హీరోయిన్ లేకుండా ఎవరు ఊహించుకోలేరు. అలాంటిది శిరిడి సాయి, గగనం వంటి సినిమాలలో హీరోయిన్ లేకుండానే మెప్పించడం విశేషం.

3.  వెంకటేష్, కమలహాసన్ :
విక్టరీ వెంకటేష్ ఈనాడు సినిమాల్లో హీరోయిన్ లేకుండా సింగిల్ గానే మెప్పించాడు. ఇక కమల్ హాసన్ కూడా ఇదే చిత్రంలో హీరోయిన్ లేకుండా మెప్పించడం గమనార్హం.

4. రజినీకాంత్ :
సూపర్ స్టార్ రజనీకాంత్ పెదరాయుడు సినిమా తో పాటు మరికొన్ని సినిమాలలో హీరోయిన్ లేకుండా ఒంటరిగా నటించి, బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు..

5. బాలకృష్ణ :
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో యాక్ట్ చేస్తూ, వేములవాడ భీమకవి అనే సినిమాలో కథానాయిక లేకుండానే ఒంటరిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.


6. మోహన్ బాబు :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా ప్రమోషన్ పొందిన కొన్ని చిత్రాలలో హీరోయిన్ లేకుండా నటించి అందరినీ ఒప్పించాడు..


ఇక వీరే కాకుండా కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కూడా కొన్ని చిత్రాలలో హీరోయిన్ లేకుండా ఒంటరిగా నటించి, ప్రేక్షకుల చేత వారెవ్వా అనిపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: