తెలుగు సినిమాలలో టాప్ కమెడియన్ లలో ఒకరు కృష్ణ భగవాన్. ఈయన అసలు పేరు"పాపారావ్ చౌదరి".ఆంధ్రప్రదేశ్ లోని, తూర్పుగోదావరి జిల్లాలో వీరరాజు మీనవల్లి, వీరరాజు లక్ష్మీకాంతం అనే దంపతులకు జన్మించారు. కృష్ణ భగవాన్ గారి భార్య పేరు లక్ష్మీ. వీరికి ఒక కూతురు ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది. ఇక ఈ రోజు 56 వ పుట్టినరోజు సందర్భంగా ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కృష్ణభగవాన్ తనదైన శైలిలో, కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈయన మొట్టమొదటిగా"మహర్షి"  సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈయన మహర్షి సినిమా కంటే ముందు జంధ్యాల వారి.." శ్రీవారి శోభనం"అనే సినిమాలో మొదట నటించారట. ఈయన నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలలో హీరోగా కూడా చేశాడు.

కృష్ణభగవాన్ గారు నటుడిగానే కాకుండా, ఒక రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.1991 లో వచ్చిన "ఏప్రిల్ 1 విడుదల" అనే సినిమాలో క్యారెక్టర్ లను  సృష్టించడం, కొన్ని సీన్లలో సంభాషణ రాయడం వంటివి కృష్ణ భగవాన్ గారు చేశారు. అంతే కాకుండా మోహన్ బాబు నటించిన "డిటెక్టివ్ నారద" అనే సినిమా కూడా చేశారు.కానీ ఈయన అనుకోకుండా సినిమాల నుంచి దూరమయ్యారు.

ఇక అంతే కాకుండా కృష్ణభగవాన్, సునీల్ లాంటి కమెడియన్ తో సమానంగా సినిమాలలో నటించే వారు. కానీ కొంతమంది అగ్ర దర్శకులను..తను కామెంట్ చేయడం వల్ల సినిమాల నుంచి ఆయనను దూరంగా పెట్టారని సినీ వినికిడి. ఇక మరొక కారణం టాలీవుడ్ లో పెద్దలతో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం వల్ల, తనని సినిమాల నుంచి దూరంగా పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. అలా మాట్లాడడం తప్పని అతను కూడా ఒప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో.  ఏది ఏమైనా ఇలాంటి గొప్ప నటుల్ని దూరం చేసుకోవడం సినీ ఇండస్ట్రీకి చేదు అనుభవం. ఎప్పటికైనా కృష్ణభగవాన్ తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రావాలని మన కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: