టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు నాగ చైతన్య నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా  సినిమాలో కూడా నాగ చైతన్య ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు, ఈ సినిమాలతో పాటు విక్రమ్  కే కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి రెడీగా ఉన్నాడు.

 ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో మరో రెండు సినిమాలను కూడా ఓకే చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందినిరెడ్డి దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది, ఈ మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అల్లరి నరేష్ తో నాంది మూవీ ని తీసి సూపర్ హిట్ అందుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాగ చైతన్య ఒక మూవీ లో నటించనున్నట్లు ఒక టాక్ వినిపిస్తుంది, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: