అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా,  సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన శివ మనసులో శృతి (ఎస్ ఎం ఎస్)  సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే టాక్  సంపాదించుకొన్నప్పటికీ రెజీనా నటనకు, అందచందాలకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి.  కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో రెజీనా కు సినిమా అవకాశాలు తగ్గాయి. కానీ ప్రస్తుతం మళ్లీ ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన తలైవి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన రెజీనా 2022 వ సంవత్సరంలో మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో సనా కష్టం అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. దీనికి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా దీనికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 4 ఫిబ్రవరి 2022 న విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన 1945 సినిమాలో కూడా రెజీనా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నిన్న అనగా 7 జనవరి 2022 న విడుదల అయ్యింది.  ఇక నివేదా థామస్ తో కలిసి రెజీనా నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా శాకిని ఢాకిని సినిమా కూడా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తో పాటు రెజీనా కసాండ్రా నటించిన నేనే నా అనే సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రెజీనా 2022 వ సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: