ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా రవితేజ కిలాడి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదని చెప్పాలి. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరో ను ఎలివేట్ చేయడానికి ఎక్కువ సీన్లు పెట్టినట్లుగా ఉన్నాయని వారు వెల్లడించారు. రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ చేయడం కొంత కొత్తదనం అనిపించినా కూడా రమేష్ వర్మ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించాలని స్క్రిప్టు రెడీ చేసినట్లుగా సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఓక క్రిమినల్ అంత డబ్బును దొంగిలించాలనుకోవడం పట్ల ఎలాంటి హై మూమెంట్స్ లేకపోవడమే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అని చెబుతున్నారు.

సెకండ్ హాఫ్ లో కూడా భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కానీ కథ కథనం వీక్ అవడం ఈ సినిమా చూసే వారికి నిరాశ ను కలిగించింది.  కొన్ని సీన్స్ ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. అదే సమయంలో కథనాన్ని నడిపించడంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా వేరేలా ఉండేది అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా లో రవితేజ మెయిన్ ఎస్సెట్ అయితే ఇద్దరు హీరోయిన్లు కూడా మంచి పాత్రలు పోషించారు. వారి సీన్స్ సినిమాలో పర్వాలేదనిపిస్తుంది. గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆలపించారు వీరు.

అయితే ఈ సినిమాలో నటించిన వీరికి భారీ స్థాయిలో గుర్తింపు వస్తుందని ముందునుంచి అనుకున్నట్లే ఇప్పుడు విడుదల తర్వాత కూడా అదే విధంగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే గ్లామర్ పరంగా నటన పరంగా భారీ స్థాయిలో ఇప్పుడు వారికి మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఎలాంటి స్థాయికి ఎదుగుతారు చూడాలి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి బోల్డ్ సీన్లు కూడా నటించింది ఎక్స్పోజింగ్ విషయంలో డింపుల్ హయాతి మరొక హీరోయిన్ కు భారీ స్థాయిలో పోటీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: