లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వం  లో తెరకెక్కిన భారతీయుడు సినిమా అప్పట్లో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే . అలా భారతీయుడు సినిమా అదిరిపోయే విజయాన్ని సాధించడంతో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ ని  భారీగా మొదలు పెట్టారు.

భారతీయుడు 2 మూవీ లో కాజల్ అగర్వాల్ ని చిత్ర బృందం హీరోయిన్ గా కూడా ఎంపిక చేసుకుంది . కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది . అలా భారతీయుడు 2 సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో కమల్ హాసన్ , లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో హీరో గా నటించాడు . ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  అలాగే దర్శకుడు శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక మూవీ ని మొదలు పెట్టాడు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే భారతీయుడు 2 ప్రొడ్యూసర్ లు తిరిగి భారతీయుడు 2 మూవీ ని శంకర్ దర్శకత్వం లోనే తిరిగి మొదలు పెట్టె విధంగా శంకర్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానితో ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ని శంకర్ డిసెంబర్ వరకు ముగించి ఆ తర్వాత భారతీయుడు 2 మూవీ ని దర్శకుడు శంకర్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దానితో డిసెంబర్ నుండి భారతీయుడు 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: