తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్.ఇదిలావుంటే ఇక తాజాగా సుమా హోస్ట్ గా వ్యవహరించిన ఓ ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్,చార్మి,విష్ణు రెడ్డి పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.అయితే  వాళ్ళు మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రమోషన్స్ ని హైదరాబాద్ నుండి స్టార్ట్ చేశాం.  మేము అనుకున్న ఆలోచనలకు పూర్తి భిన్నంగా మేము ఎక్కడికి సినిమా ప్రమోట్ చేయడానికి వెళ్లినా అక్కడికి ఎంతోమంది ప్రేక్షక అభిమానుల వచ్చి మమ్మల్ని ఎంతో సంతోషానికి గురి చేశారు. ముంబై సహా ఇతర నగరాల్లో మమ్మల్ని చూడడానికి ఎంతో మంది వచ్చారు.

 వారందరినీ చూస్తే మాకు ఏదో తెలియని ఫీలింగ్ ఏర్పడిందంటూ చెప్పుకొచ్చారు. అయితే అలాగే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఒకప్పుడు అసలు నేను హీరోని కాగలనా అని అనుమానం నాకు ఉండేది.  అలాంటిది ఇప్పుడు ఇంతమంది నా పై వారి ప్రేమను చూపిస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇక అసలు నాకు స్టేజ్ పై డాన్స్ చేయడం అంటే నచ్చదు. అయితే అందుకే అప్పుడప్పుడూ కొన్ని ఈవెంట్లు క్యాన్సిల్ అయితే నేను ఆనందిస్తా (నవ్వుతూ )..లైగర్ సినిమా చేశాక నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా సినిమాల్లో స్టోరీని ట్రైలర్ లోనే ఎడిట్ చేసి చూపిస్తారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోది కరీంనగర్.ఇక  వాళ్ల మమ్మీ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్ గా చూడాలని అనుకుంటుంది.  హీరో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో తన సత్తా ఏంటో చూపిస్తాడు.

అతను ఆ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డాడు? తన లవ్ మ్యాటర్ ఏంటి? అంతేకాకుండా అసలు మైక్ టైసన్ ఈ సినిమాలో ఎందుకు వస్తాడు? అనేది లైగర్ స్టోరీ.ఇక  ఈ సినిమా ముఖ్యంగా లవ్,యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇదిలావుంటే ఇక ఈ సినిమాకి ముందుగా ఫైటర్ అనే పేరు పెట్టాలనుకున్నాం కానీ ఈ పేరు చాలా రొటీన్ గా ఉంటుందని పేరును అధికారికంగా ప్రకటించలేదు.ఇకపోతే  కొన్ని రోజుల తర్వాత లైగర్ అని టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని పూరి జగన్నాథ్ అడిగారు. అయితే ఇక లైగర్ కి అర్థం ఏంటో తెలుసాకా ఇది కథ టైటిల్ అంటే అని మాకు అనిపించింది.కాగా  ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి, విజయ్ దేవరకొండ కి ఈ టైటిల్ చెప్పగానే చాలా బాగుంది అని అన్నారు.  అయితే ఈ విధంగా ముందుగా ఫైటర్ అని టైటిల్ అనుకోని ఆ తర్వాత లైగర్ గా టైటిల్ ని ఫిక్స్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: