ఆహా' వారి కోసం బాలయ్య హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ వైడ్ ఈ టాక్ షో కి మంచి అప్లాజ్ అయితే వచ్చింది.


ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి( ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) లో కూడా టాప్ రేటింగ్ నమోదు చేసిన షోగా రికార్డులు సృష్టించింది. నందమూరి బాలకృష్ణ బయట సరిగ్గా మాట్లాడలేరు అతని టాక్ షో ఎవరు చూస్తారు? అంటూ షో ప్రారంభమైన మొదట్లో ఎన్నో విమర్శలు గుప్పించేవారట నెటిజన్లు.


అయితే షో స్టార్ట్ అయ్యాక అలాంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పడింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది అల్లు అరవింద్ అండ్ టీం. మొదటి సీజన్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు పాల్గొన్నారు. సెకండ్ సీజన్ కు కూడా పెద్ద హీరోలను తీసుకురావాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


 


ఈ లిస్ట్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఉన్నారని కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతుంది. తాజాగా అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. అనుష్క ని ఈ షోకి తీసుకురావాలని అరవింద్ గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరో.


 


మరోపక్క అనుష్క కొంత కాలంగా మీడియాకి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె 'అన్ స్టాపబుల్' లో పాల్గొనడానికి ఒప్పుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ నాగార్జున హోస్ట్ చేస్తున్న షో అయితే ఆమె నో చెప్పకుండా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ షోలో కనుక అనుష్క పాల్గొంటే ఆమెకు ప్రభాస్ తో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: