సీనియర్ హీరోలంతా ఒక్కొక్కరుగా ఒక్కో ట్రాక్ లో వెళ్తూ ఉన్నారు. గత సంవత్సరం బాలకృష్ణ అఖండ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత మళ్లీ సక్సెస్ బాటలో పట్టారు. ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా వరుస బ్లాక్ పాస్టర్ సినిమాలకు బాగా బిజీగా ఉన్నారు. ఇక గత ఏడాది నారప్ప, దృశ్యం-2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు వెంకటేష్. ఇక చివరిగా ఎఫ్3 సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక చిరంజీవి ఈ ఏడాది ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని చవిచూశారు. ఇక దసరా బరిలో నిలిచిన గాడ్ ఫాదర్ చిత్రం మాత్రం బాగా సక్సెస్ అయింది.


ఇక నాగార్జున నటించిన సినిమా సోగ్గాడే చిన్నినాయన మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. నాగార్జున ఇప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అలాంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోతున్నారు. వర్మతో చేసిన ఆఫీసర్ సినిమా నుంచి నాగార్జున వరుస ప్లాపులు చవిచూస్తూనే ఉన్నారు. కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసిన సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో చాలా వరకు నాగార్జున నష్టపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.


క్రమక్రమంగా నాగార్జున మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దసరా సీజన్లో విడుదలైన ది ఘోస్ట్ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని. దీనికి తోడు డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నాగార్జున తన వందవ సినిమా పరిస్థితి ఏమిటి అంటు అభిమానులు తెలియజేస్తున్నారు. ది ఘోస్ట్ సినిమా కనీసం ఒక మోస్తారు ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి.. ఇక 100వ సినిమా ఈ సమయంలో విడుదలయితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ అభిమానుల చర్చ మొదలయింది. మరి నాగార్జున ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: