ఒకే ఒక సినిమా బాహుబలి ద్వారా ఆ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా మారిందో, ఆ తర్వాత వివిధ భాషల్లో ప్రభాస్ కు సంబంధించిన అనేక సినిమాలు అయితే విడుదలవుతున్నాయి

అంతకుముందు చేసిన సినిమాలు కూడా డబ్బింగ్ చేసి వదులుతుండడం విశేషం. ఇక బాహుబలి తర్వాత మాత్రం పూర్తిగా పాన్ ఇండియా రేంజ్ లోనే అతని సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆది పురుష్ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానున్నాడట.. ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రం కావడం తో అత్యంత అంచనాల మధ్య విడుదల చేయబోతున్నారట.

సినిమా విడుదలైన తర్వాత మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రభాస్ కి ఇప్పటివరకు తన పాత సినిమాల విషయంలో మిక్సుడ్ రిజల్ట్ వచ్చిందనే చెప్పుకోవాలి. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఇక అలా ప్లాప్ సినిమాల్లో మున్నా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చి ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిందట.

అయితే రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి అనే సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ కి ఆ తర్వాత పౌర్ణమి, యోగి వంటి ఫ్లాప్ సినిమాలు కూడా రావడంతో మంచి సినిమా కథ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది కానీ మాస్ హీరోగా ఉన్న తాను ఒక లవ్ స్టోరీ ని హ్యాండిల్ చేయలేనేమో అని అనుమానంతో ఆర్య సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.. ఇక ఆర్య సినిమా విడుదలైన తర్వాత ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఆర్య సినిమా అల్లు అర్జున్ కి మొదటి కమర్షియల్ హిట్ సినిమా కావడం గమనించాల్సిన విషయం.ఇక ఇదే సమయంలో భద్ర సినిమా స్టోరీని కూడా రిజెక్ట్ చేశాడు ప్రభాస్. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించడంతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడట.. అయితే బోయపాటి శ్రీను కి ఇదే మొదటి సినిమా కావడంతో ప్రభాస్ కాస్త ఆలోచించి వద్దని చెప్పేసాడు. ఇలా ఈ రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులు కున్నాడట  . ఇక అదే సమయంలో దిల్ రాజు రికమండేషన్ తో వంశీ పైడిపల్లి మున్నా కథను ప్రభాస్ వినిపించగా అతడు ఒకే చేసాడు. చివరగా ఈ సినిమా సైతం ఫ్లాప్ అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: