తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ ఇప్పటికే వరుసగా డాక్టర్ , డాన్ మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. డాక్టర్ మరియు డాన్ మూవీ లు వరుసగా 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని శివ కార్తికేయన్ కు అద్భుతమైన విజయాలను అందించాయి. ఇలా వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కే వీ దర్శకత్వం వహించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రిన్స్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు , ఈ మూవీ ని 25 నవంబర్ 2022 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: