తనకు 67 సంవత్సరాలు వచ్చినప్పటికీ డాన్స్ లో రొమాన్స్ లో తాను ఇప్పటికీ నెంబర్ వన్ అని చెప్పే విధంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి రవితేజా లు కలిసి నటిస్తున్న ‘వాల్టేర్ వీరయ్య’ సంక్రాంతికి విడుదల కాబోతున్న పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేస్తున్నారు.


చిరంజీవి రవితేజా లు కలిసి ఒక గ్ల్మార్ బ్యూటీతో ఐటమ్ సాంగ్ చేస్తే మాస్ ప్రేక్షకుల ఈలలతో ధియేటర్లు దద్దరిల్లి పోవడం ఖాయం. ఇప్పుడు అదే జరగబోతోంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఒక మాస్ ఐటమ్ సాంగ్ కు చిరంజీవి రవితేజా లతో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాల చిందులు వేసింది.


వాస్తవానికి ఈమెను ముంబాయ్ నుండి ఈ ఐటమ్ సాంగ్ కోసం ఈ మూవీ యూనిట్ తీసుకురాలేదు అని తెలుస్తోంది. ఆమె బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న మూవీ ఐటమ్ సాంగ్ షూటింగ్ కోసం ముంబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిందట. ఈవిషయాన్ని తెలుసుకున్న దర్శకుడు బాబి బోయపాటి సహకారంతో ఊర్వశిని ఒప్పించి తమ సినిమాలో కూడ ఐటం సాంగ్ చేసే విధంగా ఒప్పించాడట.


ఒకవైపు రామ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తూనే మరొక వైపు చిరంజీవి రవితేజ లతో కలిసి ‘వాల్టేర్ వీరయ్య’ లో కూడ ఒక ఐటమ్ సాంగ్ ను పూర్తిచేసి ఒకేసారి రెండు తెలుగు సినిమాలలో ఊర్వశి తన గ్లామర్ ను మాస్ ప్రేక్షకులకు రుచి చూపించబోతోంది. మాస్ సాంగ్స్ విషయంలో చిరంజీవి రవితేజలు రెచ్చిపోవడం మొదలుపెడితే అది ఒక రేంజ్ లో ఉంటుంది. దీనితో ఈ మాస్ సాంగ్ ‘వాల్టేర్ వీరయ్య’ కు కాసుల వర్షం కురిపిస్తుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ బాలయ్య ‘వీర సింహారెడ్డి’ తో పోటీ పడుతున్న పరిస్థితులలో బాలయ్య సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: