సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరుపొందిన త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది. ఇన్నేళ్లు కెరియర్ లో ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయిన ఈ ముద్దుగుమ్మ పాన్నియన్  సెల్వన్ సినిమాతో మరొకసారి తన నటన ఏంటో ప్రూఫ్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత తమిళంలో మళ్లీ పుంజుకుంది త్రిష.


ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ లోకేష్ కనకరాజు విజయ్ నటించిన బోతున్న సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించబోతోంది. విజయ్తో సుదీర్ఘ విరామం తర్వాత మరొకసారి త్రిష జంట కట్టబోతోంది. ఈ సినిమాలతో పాటు ఫిమేల్ సెంట్రీ కదల కి కూడా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ చెన్నైలో తాజాగా రూ.30 కోట్ల రూపాయలు పెట్టి హీరో విజయ్ దళపతి ఇంటి పక్కన ఒక హౌస్ని కొనుగోలు చేసినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత ఖరీదైన బంగ్లాని త్రిష తీసుకోవడం వెనక కోలీవుడ్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఉన్నపలంగా ఇంత ఖరీదైన ఇంటిని త్రిష ఎందుకు కొనుగోలు చేసిందనే విషయం అభిమానులలో సందేహం కలుగుతున్న నేపథ్యంలో.. మరో టార్క్ బయటికి రావడం జరుగుతోంది. త్రిష త్వరలోనే వివాహం చేసుకోబోతోందని ఉన్నపలంగా అందుకే ఇంత ఖరీదైన ఇంటిని కొన్నది అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఒకసారి త్రిష నిశ్చితార్థం చేసుకొని వివాహం క్యాన్సిల్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాల వద్దని చెప్పడంతో అప్పుడు క్యాన్సల్ చేసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈసారి తానే సొంతగా ఇండిపెండెంట్ ఎలాంటి ఇబ్బంది కలిగించని వ్యక్తిని ఈమె వివాహం చేసుకోబోతోందని సమాచారం. దీంతో త్రిష వివాహం ఈ ఏడాదిలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: