గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాలపై ఇదివరకే చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది రష్మిక. తామిద్దరం మంచి స్నేహితులు అని మా ఇద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేమీ లేదు అని చాలా సందర్భాల్లో తెలిపింది. తాజాగా వీరిద్దరూ మాల్దీవ్స్ లో ప్రత్యక్షమయ్యారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. 

వాటి గురించి ఇప్పటివరకు రష్మిక గాని విజయ్ గాని స్పందించలేదు. తాజాగా రష్మిక మందన విజయ్ తో రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగానే రష్మిక మందన మాట్లాడుతూ.. తమ ఇద్దరం మాల్దీవ్స్ కి కలిసి వెళ్ళింది నిజమే అని.. కలిసి వెళ్ళినంత మాత్రాన తప్పేముంది అని.. మేమిద్దరం మంచి స్నేహితులు అని.. ఈ డేటింగ్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది రష్మిక. రష్మిక మందన విజయ్ దేవరకొండ తో కలిసి ముందుగా గీతాగోవిందం అనే సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు.

ఇక ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాల అనంతరం వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు .ఎక్కడికి పడితే అక్కడ వీరిద్దరూ కలిసి వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని అందరూ భావించారు. కానీ ఎప్పటికప్పుడు రష్మిక మందన మాత్రం మామిద్దరం మంచి స్నేహితులమని ఈ విషయాన్ని కొట్టి పారేస్తుంది. ఇక రష్మిక మందన సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఆమె నటించిన వరీసు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మిక.దీంతోపాటు మిషన్ మజ్ను అనే ఒక బాలీవుడ్ సినిమాలో సైతం నటించిన ఈమె ప్రస్తుతం రష్మిక మందన పుష్పటు మరియు యానిమల్ వంటి సినిమాలు నటిస్తూ బిజీగా ఉంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: