యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది .టాలీవుడ్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తోంది. సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ తన క్రేజీ ను మాత్రం పెంచుకుంటూనే ఉంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా హిందీలో వచ్చిన ఫర్జీ  లో రాశి ఖన్నా తన నటనతో ఆకట్టుకుంది.. మరొకవైపు బోర్డ్ పర్ఫామెన్స్ తో కూడా అందరిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. పలు చిత్రాలలో కూడా గ్లామర్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో చాలా బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇలా ఉంటే అవకాశాలు రావని కాస్త స్లిమ్ అయ్యి కనిపించింది. దీంతో తన గ్లామర్ మొత్తం పోయింది అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా అదిరిపోయే ఔట్ఫిట్ లో ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేస్తోంది. తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ప్యారిస్ లో రాశి ఖన్నా నెదర్లాండ్ లో పలు వెకేషన్లలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేసింది. రెడ్ జాకెట్లు బ్లాక్ జీన్స్ , షూలో స్టైలిష్ గా కనిపిస్తోంది మరొకవైపు సన్ గ్లాసెస్ ధరించి అదిరిపోయే ఫోజులను ఇస్తోంది. ఇక మరొక ఫోటోలో గ్రీన్ కలర్ టీ షర్టు బ్లూ కలర్ జీన్స్ షూస్ ధరించి ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తున్నట్టుగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: