తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్ లలో రాఘవేంద్ర రావు ఒకరు...అయితే డైరెక్టర్లకి హీరోలకి మధ్య అలాగే హీరోలకి నిర్మాతలకి మధ్య, హీరో హీరోయిన్లకు మధ్య హిట్టు పెయిర్ అనే గుర్తింపు వస్తూ ఉంటుంది.

అయితే ఇది ఎక్కువగా హీరో హీరోయిన్ల విషయంలో వినిపిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది డైరెక్టర్ హీరోలకు కూడా హిట్టు పెయిర్ అనే గుర్తింపు ఉంది. ఇక అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కూడా ఒకరిని చెప్పుకోవచ్చు...

వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 12 సినిమాలు వచ్చాయి. ఇందులో పది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక 12 సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయంటే వీరి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి రాఘవేంద్రరావు గారు ఒకానొక సమయంలో ఎన్టీఆర్ గారి కాళ్లు పట్టుకున్నారు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి అంత పెద్ద డైరెక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది.అసలు విషయం ఏంటి..అని చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు...

అయితే అసలు విషయం ఏమిటంటే.. సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అడవి రాముడు. ఈ సినిమా కోసం రాఘవేంద్రరావు చాలా భయపడ్డారట. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పటికే ఎన్నో జానపద పౌరాణిక సినిమాల్లో నటించిన పెద్ద హీరో అందుకే ఆయనతో ఏ సినిమా సన్నివేశం తెరకెక్కించాలన్న చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి అని భావించారట.ఇక ఈ సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట లో సీనియర్ ఎన్టీఆర్ గారు వాల్మీకి, శ్రీరాముడు,ఏకలవ్యుడి పాత్రలో కనిపిస్తారు... అయితే ఆ పాటలోని బ్యాక్ డ్రాప్లో శ్రీరాముడు పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినప్పుడు శబరి పాత్ర లో ఉన్న ఆమె శ్రీరామున్ని తలపైకి ఎత్తి చూడదు కేవలం శ్రీ రాముని పాదాలను మాత్రమే ఆమె చూస్తుంది.అయితే ఈ సన్నివేశాన్ని స్వయంగా రాఘవేంద్రరావు చేసి చూపిస్తానని చెప్పి శబరి పాత్రలో రాఘవేంద్రరావు గారు చేసి చూపించారు.ఇక ఆ సన్నివేశంలో భాగంగానే రాఘవేంద్రరావు గారు సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని ఒక బొట్టు కన్నీళ్లు రాల్చారు. ఈ విధంగా సినిమా షూటింగ్ లో భాగంగా రాఘవేంద్రరావు ఎన్టీఆర్ గారి కాళ్లు పట్టుకున్నారు...అది గమనించిన ఎన్టీయార్ రాఘవేంద్ర రావు ఎందుకు తన కళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు అనే విషయం నిజమా అబద్దమా అనేది అర్థం కాలేదు దాంతో ఎన్టీయార్ డైరెక్టర్ కి సారీ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టనా రాఘవేంద్ర రావు గారు అని అంటే అప్పుడు ఆయన లేదండి మిమ్మల్ని ఆ గేటప్ లో చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు అని చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: