ప్రతివ్యక్తికి తన జీవితానికి సంబంధించి ఎన్నోరకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఆ భయాల గురించి ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంతకు రెట్టింపు వేగంతో భయాలు మనలను భయపెడుతూ ఉంటాయి. మనస్తత్వ శాస్త్రవేత్తల విశ్లేషణల ప్రకారం 101 రకాల భయాలు ఉన్నాయని చెపుతూ ఉంటారు.


ఒక పని ప్రారంభించడానికి ముందు ఏవిషయం అయినా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి ఆపని పై భయాలు ఉంటాయి. అందుకే భయాన్ని జయిస్తే తప్ప విజయం రాదు. విజయాన్ని పొందిన వారు మాత్రమే తాము కోరుకున్న సంపదను పొందగలుగుతారు. తార్కికంగా ఆలోచిస్తే ఈ భయాలు అన్నీ అర్థరహితాలు అని అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ భయాల ఫోబియా నుండి అంత సులువుగా ఏవ్యక్తి బయటపడలేడు.

అవకాశానికి భయం బద్ధ శత్రువు అవకాశాలు అందిపుచ్చుకుని జీవన పోరాటంలో విజేతలు అయిన వ్యక్తికి మాత్రమే సంపద పెరుగుతుంది కాబట్టి సంపదకు అడ్డుగా నిలిచేది భయం. అందుకే మన భయాలు ఏమిటో క్లియర్ గా అర్ధంచేసుకుని ఆ భయాల నుండి బయటపడగల కారణాలు అన్వేషించగల వ్యక్తి మాత్రమే భయం పై విజయం సాధించగలుగుతాడు.


ప్రతి వ్యక్తి భగత్ సింగ్ లా ప్రకాశం పంతులు లా ధైర్యవంతులు కాలేకపోయిన భయాలు ఎదిరించలేకపోతే మాత్రం పరాజితులుగా మిగిలి పోతారు. భయం నరాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ భయం వల్ల శరీరంలో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవడం వల్ల శరీరం వణుకుడు రావడమే కాకుండా మాట తడబడుతుంది. అందువల్లనే భయం గురించి ఆలోచించే వ్యక్తి ఏమి సాధించలేడు. నమ్మకం జీవిత కాలం ఉంటుంది. అదే భయం ఒక్క క్షణం మాత్రమే ఉన్న అది మన లక్ష్యాలను సర్వనాశనం చేస్తుంది. మన ఆధిపత్యం చెలాయించే భయాన్ని అదుపులో పెట్టుకోగలిగిన వ్యక్తి మాత్రమే సంపద విషయంలో తాను ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకొని విజేత కాగలిగి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు

మరింత సమాచారం తెలుసుకోండి: