చిన్నతనంలో ఉదయ్ కోటక్ క్రికెటర్ గా మారాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. గంటలు తరబడి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ మైదానంలోనే ఉండిపోయేవాడు. భవిష్యత్ లో క్రికెటర్ గా మారతాను అని కలలు కంటున్న వేళ ఉదయ్ కోటక్ 20 సంవత్సరాల వయసులో ఒక ఊహించని సంఘటన జరిగింది. అతడి తలకు క్రికెట్ బంతి తగలడంతో అత్యవసర చికిత్స చేయించుకోవడమే కాకుండా జీవించడానికే చాల పోరాటం చేయవలసి వచ్చింది.
ఆతరువాత మరణం నుంచి తప్పించుకున్నాకా తాను మళ్ళీ క్రికెట్ ఆటకు పనికిరాను అని తెలుసుకుని ఉదయ్ తీవ్ర నిరాశకులోనయ్యాడు. అయితే జీవితంలో రాణించాలి అంటే క్రికెట్ ఒకటే మార్గం కాదు అని అతడి తండ్రి తరుచూ చెప్పడంతో ఉదయ్ తన మనసు మార్చుకుని ఆతరువాత చదువు పై దృష్టి పెట్టి ముంబాయ్ లోని బజాజ్ ఇన్స్టిట్యూట్ లో ఫైనాన్స్ రంగంలో ఎమ్ బిఏ చేసాడు. అతడి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 1985లో 30 లక్షల పెట్టుబడితో ఇన్వెస్ట్ మెంట్ కంపెనీని ప్రారంభించాడు.
ఆ కంపెనీ అతి తక్కువ కాలంలో బాగా అభివృద్ధి చెందడమే కాకుండా ఏకంగా పారిశ్రామిక దిగ్గజం మహేంద్రా తో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది. ఆతువాత కోటక్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో అగ్రగామిగా ఎదిగి రిజర్వ్ బ్యాంక్ అనుమతితో కోటక్ మహేంద్రా బ్యాంక్ గా మారింది. ప్రస్తుతం ప్రపంచ సంపన్న బ్యాంకర్ గా ఎదిగిన ఉదయ్ కోటక్ ఆస్థి విలువ 1,18,400 కోట్లు అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాలిసిందే. వ్యతిరేక పరిస్థితులను ఎదిరించగలిగినవాడే సంపన్నుడు కాగలడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి