
కేంద్ర ప్రభుత్వం అందించిన వెబ్ సైట్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా వెబ్సైట్లో ఇచ్చిన లింకును ఓపెన్ చేసి ఆధార్ నంబర్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి . ఇక ఆ తర్వాత ఆధార్ కార్డు కు లింక్ అప్ అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.. దానిని మీరు ఇంకొకసారి టైప్ చెయ్యగానే మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని అడుగుతుంది మీరు నెంబర్ ఎంటర్ చేసిన తరువాత మరొకసారి ఓటిపి వస్తుంది అప్పుడు ఓటిపి ఎంటర్ చేసి అడిగిన వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫొటోతో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసిన ఐడి కార్డులు మీరు జాగ్రత్తగా లామినేషన్ చేసుకొని భద్రపరుచుకోవాలి. ఇదే పద్ధతిలో కుటుంబ సభ్యులకు కూడా ఆయుష్మాన్ భవ రికార్డులను తీసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క నిమిషం లోనే హెల్త్ కార్డు రావడం గమనార్హం. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కావలసిన వెబ్సైట్ https://healthid.ndhm.gov.in/ ద్వారా హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.