కరోనా వల్ల అన్ని సినిమాలు షూటింగ్ లు ఆగిపోయాయి.. అలా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR సినిమా కూడా మధ్య లో ఆగిపోయింది. ఈ సినిమా లోని మరో కథానాయకుడు రామ్ చరణ్ తేజ్ పాత్ర టీజర్ వచ్చేసింది.. తమ హీరో టీజర్ ఎప్పుడొస్తుందా అన్నట్లు రాజమౌళి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.. దానికి జక్కన్న ఓ పదిహేను రోజులు షూటింగ్ చేస్తే కానీ ఎన్టీఆర్ టీజర్ తయారు చేయలేనని జక్కన్న చెప్పడంతో అభిమానులు ఈ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో టీజర్ ఎప్పుడు వస్తుందో అని నిరాశకు లోనయ్యారట..