సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కార్ వారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని పరిశీలిస్తుండగా, మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విలన్ గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకోబోతున్నారట.. అయితే దీన్ని మహేష్ ఫాన్స్ ఖండిస్తున్నారు.. ఈ టైమ్ లో మహేష్ ఇలా రిస్క్ చేయడం సినిమా కి మంచి ది కాదని అంటున్నారు.. బాలీవుడ్ లో ఇప్పుడు నెపోటిజం సెగలు చెలరేగుతున్నాయి. కపూర్లు, భట్ లు, పాండే లు అంటేనే బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారని వారి జోలికి పోవద్దని అంటున్నారు..