ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే చాలా ఓర్పు, సమయం ఉండాలి. రాత్రికి రాత్రి ఓవర్ నైట్ ఎవరు అయిపోలేరు.. అలానే ఇప్పుడు ఓ యువహీరో టాలీవుడ్ లోకి దూసుకొచ్చాడు. అతనే సత్యదేవ్.. పూరి జగన్నాధ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే సత్యదేవ్ ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా లో నటించి పెద్ద హిట్ కొట్టాడు.. ప్రస్తుతం తిమ్మరుసు అనే సినిమా ని లేటెస్ట్ గా అనౌన్స్ చేశాడు సత్యదేవ్.. ఈ టైటిల్ తన గత సినిమాల టైటిల్స్ లాగే ఎంతో వెరైటీ గా ఉంది..