బాలీవుడ్ లో ఇప్పుడు ఎవరినోట విన్నా కంగనా రనౌత్ పేరే విన్పిస్తుంది..దానికి కారణాలు చాలా ఉన్నా మొదటి నుంచి కంగనా రనౌత్ వివాదాలకు ఆజ్యం పోస్తూ వస్తుంది. ఇటీవలే ముంబై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె పై శివసేన వారు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.. వీరి మధ్య ఓ చిన్న సైజు వార్ జరుగుతుందని చెప్పొచ్చు.. ఇక దేశంలో చెలరేగుతున్న డ్రగ్స్ కేసులో ఆమెను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆమె వర్గం వారు ఆరోపిస్తునారు.. కంగనా సైతం తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే ముంబై వదిలేసి వెళతానని చెప్పింది..