టాలీవుడ్ లో ముగిసిపోయిందనుకున్న డ్రగ్స్ కేసు మళ్ళీ ఓపెన్ అయ్యేలా కనిపిస్తుంది.. పలువురు సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో పోలీస్ విచారణకు ఒక్కక్కరు హాజరై అప్పట్లో సంచలనం రేపారు.. అయితే ఎందుకో తెలీదు అప్పుడు ఆ కేసు ముగిసిపోయింది. అయితే సుశాంత్ మరణం తో దేశంలో డ్రగ్స్ కేసు కాస్త టాలీవుడ్ వరకు పాకిందని చెప్పొచ్చు.. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. సుశాంత్ ప్రియురాలు రకుల్ ప్రీత్ సింగ్ పేరు ను పోలీసుల వద్ద ప్రస్తావించడంతో ఆమె ఈ కేసుల్లో ఇరుక్కున్నారు అని ప్రచారం జరిగింది..