‘భలే భలే మగాడివోయ్’ నిర్మాణ భాగస్వామి అయిన యువి క్రియేషన్స్ బేనర్లో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రానికి హీరోగా మాస్ రాజా రవితేజ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ముందు శర్వానంద్ హీరోగా మారుతి తర్వాతి సినిమా అని వార్తలొచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం రవితేజ పేరు వినిపిస్తోంది. అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మారుతి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు.