అఖిల్ మాస్ ఇమేజ్ తెచ్చుకునే క్రమంలో సురేందర్ రెడ్డి తో ఓ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ కోసం నిర్మాతల్లో ఒకరైన సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారట. ఈ స్టైలిష్ థ్రిల్లర్ కోసం సుమారు 40 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నారట. అయితే అంత బడ్జెట్ అఖిల్ మీద వర్కౌట్ అవుతుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సైరా సినిమా లాంటి భారీ బడ్జెట్ సినిమా చేసిన సురేందర్ మీద నమ్మకం ఉన్నా అఖిల్ కి ఇంత బడ్జెట్ అవసరమా అనే వాదనలు వినపడుతున్నాయి..